అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
నాచారం, డిసెంబర్ 03 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి నాచారం డివిజన్‌లో రూ. 1.85 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ఈ పనులు ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు.ప్రారంభించిన పనుల్లో అన్నపూర్ణ కాలనీ రోడ్ నం.లో సీసీ రోడ్ (₹30 లక్షలు), ఇంద్రనగర్ 1వ ఎడమ వీధి సీసీ రోడ్ (రూ 30 లక్షలు), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పక్క లేన్ సీసీ రోడ్ (రూ 37 లక్షలు), స్నేహపురి కాలనీ పార్కు ఫెన్సింగ్ (రూ 20 లక్షలు), శ్రీనగర్ కాలనీ పార్కు ఫెన్సింగ్ పనులు (రూ 10 లక్షలు), బాబానగర్ ప్రాంతంలోని రెడ్డి సమాధి వాటిక అభివృద్ధి పనులు (రూ 58.5 లక్షలు) ఉన్నాయి.ఈ కార్యక్రమంలో డిఈ బాలకృష్ణ, ఏఈ వినీత్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments