చెకుముకి టెస్ట్‌లో టాలెంట్ విద్యార్థుల మెరుపు.

చెకుముకి టెస్ట్‌లో టాలెంట్ విద్యార్థుల మెరుపు.

సత్తుపల్లి, నవంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్లో సత్తుపల్లి టాలెంట్ స్కూల్ విద్యార్థులు మెరిశారు. ఈ పోటీల్లో నారపోగు రామ్‌చరణ్‌, ముప్పాల కావ్య, షేక్ ఆస్పియా ద్వితీయ స్థానాన్ని సాధించి ప్రతిభ చాటుకున్నారు.

విజేతలకు గంగారం బెటాలియన్ అదనపు కమాండెంట్‌, సత్తుపల్లి విద్యాశాఖ అధికారి నక్కా రాజేశ్వరరావు శీల్డ్‌లు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ పులి శ్రీనివాసరావు మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడం గురువుల ప్రధాన భాద్యత. చదువు మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో అవగాహన పెంపొందేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. ఒక్కో విద్యార్థిలో ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుంది. దాన్ని గుర్తించి తీర్చిదిద్దితే వారు విజయాలను సొంతం చేసుకుంటారు అని తెలిపారు.

విజేతలను టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ & ప్రిన్సిపాల్ పులి అరుణ, స్కూల్ ఇంచార్జ్ శంకర్‌, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .