ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.
సత్తుపల్లి, నవంబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):
వేంసూరు మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించేందుకు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మర్లపాడు, కుంచపర్తి గ్రామాల్లోని ఐకెపి, సహకార సంఘాల కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులు తీసుకొచ్చిన ధాన్యం కాటాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా ధాన్యం కాటాలు వేయాలి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలి అని స్పష్టం చేశారు.
రాబోయే రెండు రోజుల పాటు తుపాను ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, రైతులు తమ ధాన్యాన్ని టార్పాల్స్‌తో కప్పి తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. తనిఖీలలో తహశీల్దార్ మాణిక్‌రావు, వ్యవసాయ అధికారి పచ్చల రాంమోహన్, రెవెన్యూ అధికారులు, జీపీఓలు, ఐకెపి మరియు సహకార సంఘాల సిబ్బంది పాల్గొన్నారు.


Comments