తుమ్మలతో కాంగ్రెస్ శ్రేణులు భేటీ.!
Views: 38
On
సత్తుపల్లి, నవంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
దమ్మపేట మండలంలోని గండుగులపల్లి గ్రామంలో తుమ్మల నాగేశ్వరరావు నివాసం వద్ద సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు తుమ్మలతో భేటీ అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఐదు మండలాల నుండి వచ్చిన నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సత్తుపల్లి నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్ల విస్తరణ, భవిష్యత్ మౌలిక వసతుల అవసరాలపై నాయకులు వివరించారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయి ప్రచారాన్ని వేగవంతం చేయాలని, బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి సమన్వయంతో ముందుకు సాగాలని తుమ్మల సూచనలు అందించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
03 Dec 2025 21:50:31
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)
ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...


Comments