నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
నాగరం, నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)
“నశా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా జెడ్ పిహెచ్ఎస్ నాగరం పాఠశాలలో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి మత్తు పదార్థాల ఉపయోగాన్ని పూర్తిగా నిరోధించే దిశగా ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో నాగరం మునిసిపల్ కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి, మేనేజర్ బి. నారాయణ రెడ్డి, వార్డు అధికారులు, యుఎల్‌బి సిబ్బంది పాల్గొన్నారు. నశా ముక్త్ భారత్ లక్ష్య సాధనకు విద్యార్థులు, ప్రజలు కలిసి ముందుకు రావాలని కమిషనర్ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలు వ్యక్తి ఆరోగ్యాన్ని, కుటుంబ స్థిరత్వాన్ని, సమాజ శాంతిని దెబ్బతీసే ప్రమాదం ఉన్నందున వాటి నుంచి పూర్తిగా దూరంగా ఉండాలని ఆయన సూచించారు.మత్తుమందుల రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహన పెంపొందించేందు
కు చేపట్టిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు చురుకైన స్పందన చూపించారు. ఈ తరహా అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.


Comments