స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో మితిమీరిన వేగం
పీచరలో స్థానికుల ఆందోళన
Views: 5
On
వేలేరు, 17 నవంబర్ (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలో వాహనదారులు మితిమీరిన వేగంతో ప్రయాణించడం స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో వాహనాలు అదుపు తప్పేలా వేగంగా దూసుకెళ్తున్నాయి. రహదారిపై చిన్నపిల్లలు, వృద్ధులు తరచుగా సంచరిస్తుండటంతో ఎప్పుడైనా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని గ్రామస్తులు భావిస్తున్నారు.ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, గ్రామంలో సురక్షిత ప్రయాణ వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
19 Nov 2025 21:31:43
కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)
వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ


Comments