వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రత్యేక చర్యలు 

ఎస్ఈ ప్రతిమషోమ్

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రత్యేక చర్యలు 

చెర్లపల్లి, నవంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని హబ్సీగూడ విద్యుత్ సర్కిల్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ (ఎస్ఈ) ప్రతిమషోమ్ తెలిపారు.చెర్లపల్లి పారిశ్రామికవాడ లో ఇటీవల ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ఫీడర్ బైఫర్కేషన్‌లో భాగంగా రెండు కొత్త విద్యుత్ ఫీడర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ఫీడర్లను ఎస్ఈ ప్రతిమషోమ్ సైనిక్‌పురి డివిజన్ డీఈ అన్వర్ పాషా, చెర్లపల్లి ఏడీఈ రాందాస్‌లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్ఈ ప్రతిమషోమ్ మాట్లాడుతూ,“స్థానికంగా నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేం దుకు ప్రత్యేక దృష్టి పెట్టాం. వారంలో మూడు రోజులపాటు బస్తీ బాట, విద్యుత్ వినియోగదారుల శిబిరాలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరిస్తున్నాం” అని తెలిపారు. వినియోగదారులు ఎలాంటి లోపం లేకుండా విద్యుత్ పొందేందుకు తమ సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటూ తక్షణ స్పందన ఇస్తున్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో చెర్లపల్లి ఏఈ బాల్ రాజు, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .