మాజీ జెడ్‌పిటిసి సోలిపురం రవీందర్ రెడ్డి తల్లి పద్మమ్మ కన్నుమూత

పరామర్శించి నివాళులు అర్పించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

మాజీ జెడ్‌పిటిసి సోలిపురం రవీందర్ రెడ్డి తల్లి పద్మమ్మ కన్నుమూత

వనపర్తి,నవంబర్16(తెలంగాణ ముచ్చట్లు):

ఖిల్లా ఘణపురం మండలం సోలిపురం గ్రామానికి చెందిన మాజీ జెడ్‌పిటిసి, సింగిల్ విండో మాజీ చైర్మన్ తేనేటి రవీందర్ రెడ్డి గారి తల్లి పద్మమ్మ (88) శనివారం మధ్యాహ్నం అనారోగ్యంతో కన్నుమూశారు.

విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదివారం ఉదయం సోలిపురం గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పద్మమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

పద్మమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఖిల్లా ఘణపురం సింగిల్ విండో అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ క్యాం వెంకటయ్య, వెంకట్రావు, గంజాయి రమేష్, మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మి, మాజీ సర్పంచ్ సతీష్, ఆగారం ప్రకాష్, శ్యాంసుందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .