మిరాకిల్ మైండ్స్ లో బాలల దినోత్సవం.

నేటి విద్యార్థులే రేపటి అద్భుత భవిష్యత్తు.

మిరాకిల్ మైండ్స్ లో బాలల దినోత్సవం.

సత్తుపల్లి, నవంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మిరాకిల్ మైండ్స్ పాఠశాలలో నిర్వహించిన వినూత్న కార్యక్రమాలు చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపాయి. చాచా నెహ్రూ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటిస్తూ ఆరంభమైన వేడుకల్లో విద్యార్థులు చేసిన నృత్య రూపకాలు, ప్రతిభ ప్రదర్శనలు తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి.

భవిష్యత్తు నిర్మాణంలో తామే స్తంభాలమని భావిస్తూ విద్యార్థులు చేసిన పలుకులు, ప్రదర్శించిన అంకితభావం వేడుకకు ప్రత్యేకతను తెచ్చాయి. చిన్నారుల ప్రసంగాలు, పాటలు కార్యక్రమానికి మరింత అందం చేకూర్చాయి.

సామాజిక అవగాహన, విలువలతో కూడిన విద్య అందించి సత్తుపల్లి ప్రాంతం నుంచే భారతీయ సర్వీసులకు విద్యార్థులను పంపించడమే పాఠశాల లక్ష్యమని ప్రిన్సిపాల్ రత్నాకర్ తెలిపారు. పూర్తి ఆంగ్ల భాషలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆసాంతం ఆకట్టుకుందని పుర ప్రముఖులు ప్రశంసించారు.

తల్లిదండ్రుల సహకారంతో మరిన్ని సృజనాత్మక కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రయత్నాలు సాగనున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు.IMG-20251115-WA0070

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .