18న నాయి బ్రాహ్మణుల వనమహోత్సవం
◆ నాయి బ్రాహ్మణ కుల బంధువులారా.. వేలాదిగా తరలిరండి
◆ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక ఖమ్మం నగర అధ్యక్షులు యలమందల జగదీష్ నాయి
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 14, తెలంగాణ ముచ్చట్లు;
ఆత్మీయత, అనురాగాలకు వేదికగా ఈనెల 18న మంగళవారం ఖమ్మం నగరం గొల్లగూడెం రోడ్డులో గల చెరుకూరి వారి మామిడితోటలో నాయి బ్రాహ్మణుల కార్తీకమాస వనసమారాధన కార్యక్రమాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయి బ్రాహ్మణులు కుటుంబ సమేతంగా తరలివచ్చి విజయవంతం చేయాలని నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక ఖమ్మం నగర అధ్యక్షులు యలమందల జగదీష్ నాయి, ఉద్యోగ సంఘ నాయకులు దేవరకొండ సైదులు నాయి, మాజి మార్కెట్ వైస్ చైర్మన్ కొలిపాక బాబురావు పిలుపునిచ్చారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... ఆధ్యాత్మికత, ఆహ్లాదం, ఐక్యమత్యమే లక్ష్యంగా నవంబర్ 18న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాయి బ్రాహ్మణులందరూ ఒక కుటుంబంగా ఒక దగ్గరకు రావడం గొప్ప ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి అన్నారు. ఇది భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ సంవత్సరం మొదలుకొని ప్రతి సంవత్సరం జరిగే వనమహోత్సవాలు నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి వేదిక అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ వనమహోత్సవంలో పిల్లలు, మహిళలు, యువత పాటలు, ఆటలు, కేరింతలతో మంగళవారం సరదాగా గడిచిపోయి వచ్చే ఐదు వేల మంది నాయి బ్రాహ్మణులకు శాశ్వతంగా గుర్తుండాలన్నారు. నాయి బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ ఇది నా కుటుంబ వనమహోత్సవం అనుకొని ప్రతి ఒక్కరిని తరలించేందుకు, మన బలం, మన ఐక్యతను చాటి చెప్పాలన్నారు.
ఈ విలేకరుల సమావేశంలోఉద్యోగ సంఘ నాయకులు జిడుగు వెంకటరామకృష్ణ, జిల్లా నాయకులు నంద్యాల నరసింహారావు, రావులపాటి శ్రీనివాస్, సంఘం గౌరవ సలహాదారులు సూత్రాల శ్రీనివాసరావు నాయి, దోమకొండ నాగేశ్వరరావు నాయి, వర్కింగ్ ప్రెసిడెంట్ లు తుపాకుల కృష్ణ నాయి, శ్రీరాముల సైదులు నాయి, శ్రీపతి రామనాథం నాయి, కొలిపాక రాఘవేంద్రరావు నాయి, సహాయ కార్యదర్శి సురభి సందీప్ నాయి, కోశాధికారి అద్దంకి పాపారావు నాయి, ప్రచార కార్యదర్శి చిట్యాల సైదాబాబు నాయి, స్టీరింగ్ కమిటీ సభ్యులు గరిడేపల్లి నవీన్ నాయి, సభ్యులు మాదారపు భిక్షం నాయి తదితరులు పాల్గొన్నారు.


Comments