అధికారుల కనుసన్నల్లో అక్రమ నిర్మాణాలు
నాగారంలో అక్రమాలకు అంతం లేదా?
నాగారం, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో నిబంధనల కు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వల్ల మున్సిపాలిటీ పరిధి మొత్తం రేకుల షెడ్లు, కమర్షియల్ భవనాలు కోకొల్లలు గా వెలుస్తున్నాయి.నాగారం రాంపల్లి
మెయిన్ రోడ్ వెంబడి కమర్షియల్ షెడ్‌ల నిర్మాణాలు బహిరంగంగా జరుగుతున్నా అధికారులు “నిమ్మకు నిరెత్తినట్టు” వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై పలువురు ప్రజాప్రతి నిధులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి వంటి వారు అనేకసార్లు ఫిర్యాదులు చేసినా, ఇప్పటివరకు చర్యలేమీ తీసుకోక పోవడం ప్రజల్లో ఆగ్రహం రేపుతోంది.సర్వే నంబర్ 360లోని వెంకటేశ్వర కాలనీలో, పురాతన బావి దగ్గర సెట్‌బ్యాక్ లేకుండా బిల్డర్లు ఇంటి నిర్మాణాలు చేపట్టి వినియోగదారుల ను మోసం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. రాంపల్లి రోడ్డులోని మరో నిర్మాణంలో సంపు, సెప్టిక్ ట్యాంక్‌నే రోడ్డుపైనే వేసినట్టు తెలుస్తోంది.ఇటీవల పత్రికలలో, సోషల్ మీడియాలో కూడా మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీదేవి, చైర్మన్‌ల నిర్లక్ష్యంపై వరుస వార్తలు వచ్చినా, కమిషనర్ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లంచాల మాయం ఉందేమోననే అనుమానా లు వ్యక్తమవుతున్నాయి.అదే సమయం లో పేద, మధ్య తరగతి ప్రజలపై మాత్రమే పన్నులు, వడ్డీలు, బలవంతపు వసూళ్ల చర్యలు మున్సిపాలిటీ తీసుకోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు.నాగారం మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఈ అక్రమాలపై పైస్థాయి అధికారులతో విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజాప్రతినిధు లు, పత్రికా వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


Comments