కార్తీక పౌర్ణమి కీసరగుట్ట ఆలయాన్ని సందర్శించిన రాచకొండ సీపీ 

భద్రతా ఏర్పాట్లపై సమీక్ష

కార్తీక పౌర్ణమి కీసరగుట్ట ఆలయాన్ని సందర్శించిన రాచకొండ సీపీ 

కీసర, నవంబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు)

కార్తీక పౌర్ణమి పర్వదినం కావడంతో కీసరగుట్ట శ్రీ భవానీ శంకర స్వామి దేవాలయంలో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు, ఐపీఎస్ స్వయంగా పర్యటించారు.ఆలయ ప్రధాన ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, అడవి మార్గాలు, గోపురం చుట్టుపక్కల ప్రాంతాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు. భక్తులు సౌకర్యవంతంగా ద‌ర్శనం చేసుకునేందుకు, ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు.సీసీ కెమెరాల పనితీరు, డ్రోన్ పర్యవేక్షణ, క్యూలైన్ మేనేజ్మెంట్, మహిళ భద్రత, ట్రాఫిక్ డైవర్షన్లు, పార్కింగ్ లైన్ల ఏర్పాట్లపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడం దృష్ట్యా అదనపు పోలీసు బలగాలు, శిక్షణ పొందిన సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ ను కూడా మోహరించినట్లు అధికారులు తెలిపారు.భక్తులు సురక్షితంగా, ప్రశాంతంగా పర్వదినాన్ని జరుపుకునేలా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. భక్తుల సహకారంతో వాహనాలను క్రమబద్ధంగా పార్క్ చేయాలని, అనుమతి లేని ప్రాంతాల్లో వాహనాలు నిలిపివేయరాదని సూచించారు.ప్రత్యేక వైద్య బృందాలు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచి అత్యవసర సేవలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాలు చక్కగా కొనసాగుతున్నాయని సీపీ అన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వల్భాపూర్‌లో ఘనంగా శ్రీ పశుపతినాథ్ దేవస్థానం లో కార్తీక పౌర్ణమి వేడుకలు వల్భాపూర్‌లో ఘనంగా శ్రీ పశుపతినాథ్ దేవస్థానం లో కార్తీక పౌర్ణమి వేడుకలు
-ఆలయ అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి ఆధ్వర్యంలో సహస్ర బిల్వార్చన, మహా రుద్రాభిషేకం ఎల్కతుర్తి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు): ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ దేవాలయంలో కార్తీక పౌర్ణమి...
సత్యనారాయణ కాలనీలో కార్తీక పౌర్ణమి పూజలు 
దాశరధి కృష్ణమాచార్యుల 38వ వర్ధంతి 
కార్తీక పౌర్ణమి కీసరగుట్ట ఆలయాన్ని సందర్శించిన రాచకొండ సీపీ 
మధు కుమార్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు
ప్రమాదం అంచులో ఆగారం-ఘనపూర్ ప్రధాన రహదారి
జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ గెలుపు ఖాయం