జఫర్ ఘడ్ నూతన ఏంఆర్ఓ, ఎస్ఐలకు బిజెపి నేత వెంకన్న సత్కారం
జఫర్ ఘడ్, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
జఫర్గడ్డ్ మండలంలో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నూతన ఏంఆర్ఓ బి. రాజేష్, మండల పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ బి. రామారావులను బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జీ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు (వెంకన్న) మర్యాదపూర్వకంగా కలిసి శాలువ కప్పి సత్కరించారు.ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ, మండల అభివృద్ధి, ప్రజా సేవల నిర్వహణలో అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జనగామ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం రాజు, కిసాన్ మోర్చా హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు దుస్స రాములు, జనగామ జిల్లా నాయకులు బుర్ర తిరుపతి గౌడ్, ఎస్సీ
మోర్చా మండల అధ్యక్షులు ఇల్లందుల సారయ్య, బీజేఎమ్ మండల అధ్యక్షులు తాళ్లపల్లి సురేష్ గౌడ్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు యాక స్వామి, మండల ఉపాధ్యక్షులు పందిబోయిన రాజు, కోమల్ల గ్రామ బూత్ అధ్యక్షులు వల్లాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు కాల్వ రవి, ఎదులాపురం జయశంకర్, గడ్డం వెంకటేశ్వర్లు, మన్ కీ బాత్ మండల కన్వీనర్ గిరగొని యాదగిరి గౌడ్, కిసాన్ మోర్చా హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓరుగంటి రవీందర్ రెడ్డి, సకినాల కొమురెల్లి తదితరులు పాల్గొన్నారు.


Comments