శిథిలావస్థలో మద్దిగట్ల పల్లె దావఖాన
రెండేళ్లయిన ప్రారంభానికి నోచుకోని పల్లె దావఖాన నూతన భవనం
Views: 26
On
పెద్దమందడి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలోని పల్లె దావఖాన ప్రస్తుతం శిథిలావస్థలో ఉండడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దావఖాన ప్రాంగణం అపరిశుభ్రంగా మారిపోవడంతో రోగులు అక్కడ చికిత్స కోసం రావడానికే భయపడుతున్నారు.
గత ప్రభుత్వ కాలంలోనే నూతన భవనం నిర్మాణానికి మంజూరు లభించినప్పటికీ, బిల్లులు మంజూరులో జాప్యం కారణంగా నిర్మాణం మధ్యలో దాదాపు 80% భవనం పూర్తయిన ఫలితంగా, కొత్త భవనం రెండేళ్లుగా పూర్తి కాకుండా అలాగే వదిలేయబడింది.నూతన భవనాన్ని వెంటనే పూర్తి చేసి ప్రారంభించాలని, రోగుల సౌకర్యార్థం అవసరమైన వసతులు కల్పించి వాడుకలోకి తీసుకురావాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments