వల్భాపూర్‌లో ఘనంగా శ్రీ పశుపతినాథ్ దేవస్థానం లో కార్తీక పౌర్ణమి వేడుకలు

వల్భాపూర్‌లో ఘనంగా శ్రీ పశుపతినాథ్ దేవస్థానం లో కార్తీక పౌర్ణమి వేడుకలు

-ఆలయ అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి ఆధ్వర్యంలో సహస్ర బిల్వార్చన, మహా రుద్రాభిషేకం

ఎల్కతుర్తి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు):

ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పంచామృత సహిత మహా రుద్రాభిషేకం, సహస్ర బిల్వార్చన, దూప దీపార్చన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి.ఉదయం బ్రహ్మముహూర్తం నుంచే వేదపండితులు, ఆలయ అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి బిల్వదళాలతో ప్రత్యేక అర్చన చేశారు. ఆలయ పరిసరాలు “ఓం నమః శివాయ”, “ఓం శ్రీ పశుపతినాథాయ నమః” నినాదాలతో మార్మోగాయి.

మహిళా భక్తులు దీపాలు వెలిగించి స్వామి దర్శనార్థం తరలివచ్చారు. సాయంత్రం ఆకాశ దీప ప్రజ్వలన, ఈశ్వరలింగ దీపార్చన, అష్టోత్తర శతనామార్చన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. అనంతరం తీర్థప్రసాద వితరణ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి మాట్లాడుతూ, “కార్తీక పౌర్ణమి రోజున శ్రీ గౌరీ సమేత పశుపతినాథ్ స్వామికి సామూహిక రుద్రాభిషేకం, సహస్ర బిల్వార్చన చేయడం మహాపుణ్యప్రదం. దీపదానం ఆత్మశాంతిIMG-20251105-WA0101 కుటుంబ సౌభాగ్యం, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో శివాలయ కమిటీ చైర్మన్ గంజి భావనఋషి, కమిటీ సభ్యులు, యువకులు, మహిళా భక్తులు, గ్రామస్తులు పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వల్భాపూర్‌లో ఘనంగా శ్రీ పశుపతినాథ్ దేవస్థానం లో కార్తీక పౌర్ణమి వేడుకలు వల్భాపూర్‌లో ఘనంగా శ్రీ పశుపతినాథ్ దేవస్థానం లో కార్తీక పౌర్ణమి వేడుకలు
-ఆలయ అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి ఆధ్వర్యంలో సహస్ర బిల్వార్చన, మహా రుద్రాభిషేకం ఎల్కతుర్తి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు): ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ దేవాలయంలో కార్తీక పౌర్ణమి...
సత్యనారాయణ కాలనీలో కార్తీక పౌర్ణమి పూజలు 
దాశరధి కృష్ణమాచార్యుల 38వ వర్ధంతి 
కార్తీక పౌర్ణమి కీసరగుట్ట ఆలయాన్ని సందర్శించిన రాచకొండ సీపీ 
మధు కుమార్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు
ప్రమాదం అంచులో ఆగారం-ఘనపూర్ ప్రధాన రహదారి
జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ గెలుపు ఖాయం