జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ గెలుపు ఖాయం
డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏఐపిసి అధ్యక్షులు
వనపర్తి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు):
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని తెలంగాణ రాష్ట్ర ప్రొఫెషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి తెలిపారు.
బుధవారం ఆయన వెంగళరావు నగర్ ప్రాంతంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆదరణ పొందుతున్నాయి. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి విశేష మద్దతు ఇస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం ఖాయం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంతోష్, సందీప్, శశాంక్, నితిగ్న్య, డాక్టర్ కవిత, విక్టోరియా, సయ్యద్ రఫీ, శ్రీకాంత్, భరత్ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, చౌదరి గౌడ్, నాగార్జున, బాబా, ఎత్తం చరణ్ రాజ్, గట్టు రాజు, విగ్నేష్, సాయి నిఖేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments