హరీష్ రావు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ కార్పొరేటర్ జగదీశ్ గౌడ్
మల్కాజ్గిరి, నవంబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు)
సిద్దిపేట శాసనసభ్యులు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పితృవియోగం నేపథ్యంలో, మాజీ కార్పొరేటర్ జగదీశ్ గౌడ్ మంగళవారం సిద్దిపేటకు వెళ్లి ఆయన నివాసంలో పరామర్శించారు. హరీష్ రావు కుటుంబ సభ్యులను సాంత్వనపరుస్తూ, తండ్రి మరణం పట్ల గాఢ సంతాపం తెలిపారు.హరీష్ రావు తండ్రి సాదాసీదా జీవన విధానం, సేవాభావం, ప్రజలతో మమేకం అయ్యే తత్వం అందరికీ ఆదర్శమని గుర్తుచేసుకుంటూ, ఆయన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని జగదీష్ గౌడ్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ఈ క్లిష్ట సమయంలో దేవుడు శక్తి, ధైర్యాన్నివ్వాలని ఆకాంక్షించారు.
అలాగే, ప్రజా సేవలో కీలక పాత్ర పోషించిన హరీష్ రావు కుటుంబం బాధను రాష్ట్ర ప్రజలు పంచుకుంటున్నారని అన్నారు. తండ్రి ప్రేమ, స్ఫూర్తి ఎల్లప్పుడూ హరీష్ రావును ప్రజా సేవలో ముందుకు నడిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జనార్ధన్, నవీన్, శ్రీధర్ గౌడ్, కోటేశ్వర్, రాజు, ఇబ్రహీం మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో అందరూ పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు.


Comments