సత్యనారాయణ కాలనీలో కార్తీక పౌర్ణమి పూజలు 

సత్యనారాయణ కాలనీలో కార్తీక పౌర్ణమి పూజలు 

నాగారం, నవంబర్ 05 (తెలంగాణ ముచ్చట్లు)

నాగారం మున్సిపాలిటీలోసత్యనారాయణ కాలనీ శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి మరియు శ్రీ శిరిడి సాయిబాబా దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తిపూర్వకంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై దీపదానం చేసి స్వామి వారి ఆశీర్వాదాలు అందుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవాలయ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం కమిటీ చైర్మన్ అన్నం రాజు శ్రీనివాస్, అన్నం రాజు సురేష్, సలహాదారులు వెంకటరత్నం, చిట్యాల శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కాలనీ ప్రధాన కార్యదర్శి బి. నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కందాడి శ్రీనివాస్ రెడ్డి, ముక్కెర కరుణాకర్ రెడ్డితో పాటు సాయిలు, రెడ్యానాయక్, భద్రు నాయక్, సాయి గౌడ్, అభిలాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.భక్తుల సౌకర్యార్థం దేవస్థానం కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పవిత్ర వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులకు ఆత్మీయ ఆనందాన్ని కలిగించింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .