ప్రమాదం అంచులో ఆగారం-ఘనపూర్ ప్రధాన రహదారి
ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలి
-- మండల కాంగ్రెస్ నాయకుడు మున్నూరు జయాకర్
ఘనపూర్,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు):
ఘనపూర్ మండలం ఆగారం గ్రామం శివారులోని రెడ్లకుంట చెరువు దగ్గర ఆగారం నుండి ఘనపూర్‌కు వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదవశాత్తుగా దెబ్బతింది.
నీటి ఎద్దడికి రహదారి కొంతభాగం కోతకు గురవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మండల కాంగ్రెస్ నాయకుడు మున్నూరు జయాకర్ బుధవారం ఆ రహదారిని ప్రత్యక్షంగా పరిశీలించారు.
మున్నూరు జయకర్ మాట్లాడుతూ ..నీటి ప్రవాహం ఇలాగే కొనసాగితే రహదారి పూర్తిగా తెగిపోవచ్చు. గ్రామం నుంచి మండల కేంద్రానికి వెళ్లడానికి ఈ రహదారే ప్రధాన మార్గం. కాబట్టి పెను ప్రమాదం సంభవించేలోపే అధికారులు తక్షణ చర్యలు తీసుకుని రహదారికి మరమ్మత్తులు చేయాలి అని తెలిపారు.గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కృష్ణయ్య, బాల్ చందర్, ఖాదర్, బీరయ్య తదితరులు పాల్గొన్నారు..jpeg)


Comments