సిఐటియు జిల్లా మహాసభల వాల్ పోస్టర్ విడుదల
కీసర, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) కీసర మండల కమిటీ ఆధ్వర్యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈనెల 25, 26 తేదీల్లో చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని సిఐఏ కార్యాలయంలో జరగనున్న మహాసభల సందర్భంగా గోధుమకుంట, కరీంగూడ, దయార, దమ్మైగూడ ప్రాంతాల్లో పోస్టర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ బంగారు నర్సింహరావు మాట్లాడుతూ, ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాసభల్లో గత కార్యక్రమాలను సమీక్షించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. కార్మిక సమస్యల పరిష్కారం, కార్మికుల హక్కుల సాధన కోసం సిఐటియు నిరంతరం పోరాటం చేస్తోందని పేర్కొన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూసిఐటియు పోరాటం కొనసాగిస్తుందని ఆయన అన్నారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి కట్ట జంగయ్య, సిఐటియు నాయకులు సిహెచ్. అశోక్, జీ. వెంకటేష్, ఎన్. స్వామి, లలిత, నిఖిల, మనేమ్మ, పుష్ప, అశ్విని, భాగ్యమ్మ, పోచయ్య, శ్రీనివాస్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments