ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా యువ భారత్ శక్తి ఫౌండేషన్.
.కరెంట్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందజేత.
సత్తుపల్లి, అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
వేంసూరు మండలం దిద్దుపూడి గ్రామానికి చెందిన జుంజునూరి వెంకటేశ్వరరావు ఇటీవల కరెంట్ ప్రమాదంలో తీవ్ర గాయపడడంతో హైదరాబాదులోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చికిత్స కొనసాగించడం కష్టంగా మారిన విషయం తెలుసుకున్న యువ భారత్ శక్తి ఫౌండేషన్ సభ్యులు దాతల సహకారంతో రూ.1,00,000/- ఆర్థిక సహాయం అందించారు.
ఈ సహాయాన్ని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్వయంగా వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సమాజంలో ఒకరికి ఒకరు అండగా నిలిచే భావన ప్రతి వ్యక్తిలో పెరగాలని ఆకాంక్షించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో నైతిక విలువలు పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
వెంకటేశ్వరరావు కుటుంబానికి ఆర్థికసహాయం చేసిన దాతలకు, అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిన యువ భారత్ శక్తి ఫౌండేషన్ సభ్యులకు ఎమ్మెల్యే ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ భారత్ శక్తి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. 


Comments