అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అష్టోత్తరశత 108 కలశాలతో క్షీరాభిషేకం
కీసర, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఎస్.వి. నగర్ రోడ్ నం.8 లో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం భక్తి శ్రద్ధలతో అష్టోత్తరశత (108) కలశములతో క్షీరాభిషేకం నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ కోదండ రామాంజనేయ స్వామి, శ్రీ వల్లి దేవసేనా సహిత సుబ్రహ్మణ్య స్వామి, నాగబంధ, మృత్యుంజయ, మేధా దక్షిణామూర్తి, అభయాంజనేయ, నవగ్రహ విగ్రహాలకు క్షీరాధివాసం జరిపారు. ఆలయంలో జరుగుతున్న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఈ నెల 29 వరకు కొనసాగుతాయని, అదే రోజు బుధవారం దేవతామూర్తుల ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు ఎం.వి.ఎల్.ఎన్. శాస్త్రి తెలిపారు
.కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సుబ్రహ్మణ్య శర్మ, సహాయక అర్చకులు జమ్మలమడక శ్రీరమణ శర్మ, ఆలయ అధ్యక్షులు దాచా శ్రీనివాస్ గుప్తా, ఎర్రం ఈశ్వరయ్య గుప్త, లింగా నాగేంద్ర గుప్త, పీవీవీ. సత్యనారాయణ నరసింహస్వామి గౌడ్, గంగిరెడ్డి నరేందర్ రెడ్డి, మారెళ్ల వెంకటేశ్వరావు, వి. నర్సింహస్వామి గౌడ్, ఆంజనేయ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.


Comments