రౌడీ షీటర్లపై నిఘా ఉంచాలని రాచకొండ సీపీ ఆదేశాలు

ప్రజా శాంతి భద్రతకు భంగం కలగకుండా కఠిన చర్యలు రాచకొండ సీపీ సుధీర్ బాబు, ఐపీఎస్

రౌడీ షీటర్లపై నిఘా ఉంచాలని రాచకొండ సీపీ ఆదేశాలు

మల్కాజ్గిరి, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు)

రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేర నియంత్రణ, ప్రజా భద్రతను కాపాడే దిశగా పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని రాచకొండ పోలీసు కమిషనర్ జి. సుధీర్ బాబు, ఐపీఎస్ సూచించారు.ఇటీవలి కాలంలో కొంతమంది రౌడీ షీటర్లు మళ్లీ క్రియాశీలంగా మారుతున్నారన్న నివేదికల నేపథ్యంలో, అన్ని జోనల్ డీసీపీలు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌స్పెక్టర్లతో కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ“ప్రతి అధికారి తన పరిధిలో ఉన్న రౌడీ షీటర్ల కదలికలను నిత్యం పర్యవేక్షించాలి. వారు ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో కలుస్తున్నారు, ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు అన్న దానిపై స్పష్టమైన సమాచారాన్ని సేకరించాలి,” అని సీపీ సుధీర్ బాబు ఆదేశించారు.రౌడీ షీటర్లు లేదా ఆస్తి నేరస్థులు ఏ విధంగానైనా ప్రజా శాంతి భద్రతకు భంగం కలిగిస్తే, వారిపై తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదనంగా, ఎస్ఓటీ (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్), క్రైమ్ టీమ్‌లతో సమన్వయం చేసుకుంటూ రౌడీల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. రౌడీ షీటర్ల ఫైళ్లను, వారి గత నేర చరిత్రను పునఃసమీక్షించి, అవసరమైతే పబ్లిక్ ప్లేసుల్లో పర్యవేక్షణ పెంచాలని సూచించారు.సామాన్య ప్రజల్లో భయం, అసౌకర్యం కలిగించే ఎవరిపైనా పోలీసు వ్యవస్థ సహనానికి తావు ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. “ప్రజల భద్రత మా మొదటి ప్రాధాన్యత. రాచకొండ పరిధిలో శాంతి భద్రతను కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండదు” అని సీపీ అన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం
కుషాయిగూడ, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు)  కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఉదయం 10 గంటలకు సామూహికంగా “వందే మాతరం” గానం నిర్వహించారు. వందే మాతరం గేయం...
అమ్మపల్లి ప్రభుత్వ పాఠశాలకు బెంచీలు, గ్రీన్ బోర్డులు పంపిణీ
నాగారం మున్సిపాలిటీలో  వందే మాతరం 150 ఏళ్ల వేడుకలు 
కాజీపేట్ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఘనంగా వందేమాతరo గీతా లాపన
నాగారం మద్యం దుకాణం పై రగడ
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం
గండి రామారం పంపు హౌస్ ఎత్తిపోతల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి