ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో న్యాయ చైతన్య సదస్సు.
సత్తుపల్లి, అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి పట్టణం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి జడ్జి యం. శ్రీనివాసరావు మాట్లాడుతూ, కోర్టుల విధులు, కోర్టుల రకాల గురించి విద్యార్థులకు అవగాహన కలిగించారు. సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు ఎలా ఉంటాయి, ఏ కేసు ఏ కోర్టులో విచారణ జరగుతుందో వివరించారు.
ప్రాంసరి నోటు రాత, అది ఎంతకాలం చెల్లుబాటు అవుతుంది, ప్రాంసరి నోటు సంబంధించి తలెత్తే వివాదాల్లో కోర్టు ప్రక్రియ ఎలా ఉంటుందో స్పష్టం చేశారు. బెయిల్ బుల్, నాన్ బెయిల్ బుల్ కేసుల తేడాలు కూడా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చెప్పినట్లు తెలియజేశారు.
అలాగే బాలికలు సమాజంలో జాగ్రత్తలు పాటించే అంశంపై చైతన్యం కల్పించారు. విద్య మనిషిని రక్షించే శక్తి, న్యాయ అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరం అని సూచించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. భాగ్యలక్ష్మి జడ్జి వివరాలు విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం జడ్జిని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో లలితమ్మ, ప్రమీల, కల్పన, సత్యనారాయణ, కృష్ణవేణి, రామారావు, రాణి, శ్వేత, సమ్మక్క, శిరోమణి, వెంకటేశ్వరరావు, సౌజన్య తదితరులు పాల్గొన్నారు


Comments