సీఎం నిధులతో మల్లాపూర్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
మల్లాపూర్, నవంబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు)
మల్లాపూర్ డివిజన్‌లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ మల్లాపూర్, ఎస్.వి.నగర్ కాలనీలో సిఎం నిధులతో సీసీ రోడ్డు పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉప్పల్ కాంగ్రెస్ ఇంఛార్జి మందుముల పరమేశ్వర రెడ్డి సహకారంతో గ్రేటర్ కాంగ్రెస్ నాయకులు నెమలి అనిల్ కుమార్ చొరవ తీసుకోవడంతో ఈ పనులు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలు కోరిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం స్పందించడం సంతోషకరమన్నారు. కాలనీ వాసులు పలుమార్లు చేసిన విన్నపం మేరకు నిధులు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మల్లాపూర్ డివిజన్‌లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటామని తెలిపారు.సీసీ రోడ్ పనులు ప్రారంభంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ సహకారంతో చర్యలు తీసుకుంటున్నందుకు కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.


Comments