సీసీ రోడ్డు పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ ప్రభుదాస్
కాప్రా, నవంబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు)
మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని తిరుమలనగర్ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ బుధవారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణ నాణ్యతను పరిశీలించిన ఆయన, అధికారులు మరియు కాంట్రాక్టర్లతో మాట్లాడి సూచనలు జారీ చేశారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రభుదాస్ మాట్లాడుతూ, "కాలనీ వాసుల సౌకర్యం కోసం నాణ్యతతో కూడిన సీసీ రోడ్డు నిర్మించడం మా లక్ష్యం. మ్యాన్హోల్స్ చుట్టూ బలమైన కాంక్రీట్ వేసి హెవీ వాహనాలు నడిచినప్పటికీ రోడ్డు దెబ్బతినకుండా ఉండేలా చూడాలి. పనుల సమయంలో అన్ని భద్రతా ప్రమాణాలు పాటించాలని, నిర్దేశిత కాలంలోనే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని" అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, కాలనీ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, దాస్, మురళీ చారి, నవీన్ మరియు ఇతరులు పాల్గొన్నారు.


Comments