చర్లపల్లి స్టేషన్ అభివృద్ధి కోసం రైళ్ల మార్పులు అవసరం
చర్లపల్లి, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
చర్లపల్లి రైల్వే స్టేషన్ నగరానికి కొంత దూరంగా ఉండటం, ప్రజా రవాణా సౌకర్యాలు తక్కువగా ఉండటం వల్ల ఈ స్టేషన్‌కి పెద్దగా ఆదరణ లభించడం లేదని ట్రైన్ ట్రావెలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, జెడ్ ఆర్ యూ సిసి సభ్యుడు అనూర్ అహ్మద్ అలీ తెలిపారు.కేవలం ప్రత్యేక రైళ్లు నడపడం సరిపోదని, కొన్ని రెగ్యులర్ రైళ్లు కూడా చర్లపల్లి నుండి ప్రారంభించాలని ఆయన సూచించారు. కాజీపేట్, నల్గొండ వైపు వెళ్లే రైళ్లతో పాటు కర్నూల్, వికారాబాద్ వైపు వెళ్లే రైళ్లను కూడా చర్లపల్లి నుంచే నడపడం ద్వారా ప్రయాణికులకు సౌలభ్యం కలుగుతుందని తెలిపారు.అలాగే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో కేవలం ఆరు కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించే తుంగభద్ర, హంసధ్వని, గోవా వంటి రైళ్లను హైదరాబాద్ డివిజన్‌కు మార్చాలని లేదా చర్లపల్లి నుంచే ప్రారంభించాలని సూచించారు.టికెట్ వ్యవస్థలో సౌలభ్యం కల్పించాలంటూ, నగర పరిధిలో సబర్బన్ సెక్షన్‌లో ఎక్కడైనా దిగే విధంగా ఒకే రకమైన టికెట్ వ్యవస్థను అమలు చేయాలని కోరారు. అలాగే విజయవాడ నుండి చర్లపల్లి, మేడ్చల్, లింగంపల్లి, హైదరాబాద్ లేదా ఉప్పల్ వరకు ఉన్న ఎంఎంఎటీఎస్ లేదా ఇతర రైళ్లలో ప్రయాణం చేసే అవకాశం ఇవ్వాలని సూచించారు.మల్కాజ్‌గిరి మీదుగా వెళ్లే అన్ని రైళ్లను ఒక నిమిషం పాటు ఆపాలని, నిజామాబాద్ వైపు నుండి నల్గొండ, కాజీపేట్ వైపు వెళ్లే రైళ్లను కొత్తగా నిర్మించిన ఆర్‌కే నగర్ స్టేషన్‌లో ఆపితే ప్రయాణికులకు మేలు జరుగుతుందని తెలిపారు.
లింగంపల్లి వైపు నుండి ఘట్‌కేసర్ వైపు వెళ్లే రైళ్లను సుచిత్ర, నేరెడిమేట్ స్టేషన్లలో ఆపితే రైల్వేకి ఆదరణ పెరుగుతుందని అన్నారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని, ప్రయాణికులకు సౌకర్యం కలిగించే విధంగా రైళ్ల మార్పులు చేయాలని రైల్వే శాఖను ఆయన విజ్ఞప్తి చేశారు.


Comments