కీసరగుట్టలో కార్తీక పౌర్ణమి సందడి 

భక్తులతో కళకళలాడిన శ్రీరామలింగేశ్వర ఆలయం

కీసరగుట్టలో కార్తీక పౌర్ణమి సందడి 

కీసర, నవంబర్ 05 (తెలంగాణ ముచ్చట్లు) :

కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా కీసరగుట్టలోని శ్రీ భవాని శివదుర్గ సమేత స్వయంభూ శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా కనిపించింది. వేకువజాముననే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో నిలబడ్డారు.భక్తులు గంగాజలంతో స్వామివారికి అభిషేకాలు చేస్తూ హరహర శంభో నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న శివలింగాలకుమహిళలు పాలాభిషేకాలు చేయగా, కుటుంబ సమేతంగా కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. WhatsApp Image 2025-11-05 at 4.03.43 PMభక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శానిటేషన్, తాగునీటి సదుపాయం, భద్రతా చర్యలను బలోపేతం చేయడంతో భక్తులకు ఎటువంటి అంతరాయం లేకుండా దర్శనం జరుగుతోందని ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, కార్యనిర్వాహణ అధికారి కట్ట సుధాకర్ రెడ్డి తెలిపారు.కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొనడంతో కీసరగుట్టలో పండుగ వాతావరణం నెలకొంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .