శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు 

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు 

కాప్రా, నవంబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు):

కాప్రాలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలు భక్తిరసభరితంగా జరిగాయి. ఉదయం ప్రత్యేక పూజలు, హోమాలు, సాయంత్రం దీపోత్సవంతో ఆలయ ప్రాంగణం శోభాయమానమైంది.ప్రాంగణమంతా దీపాలతో వెలుగుల హరివిల్లు సుందరంగా అలరించింది.భక్తుల సందోహం అధికంగా ఉండటంతో దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, చైర్మన్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని కార్యక్రమాలు సద్విధంగా నిర్వహణ జరిగేలా కమిటీ శ్రద్ధ తీసుకుంది.WhatsApp Image 2025-11-05 at 7.41.06 PM దేవాలయ నిర్వహణ, సేవాభావం భక్తులను ఆకట్టుకుంది. స్వల్ప కాలంలోనే భక్తులు మరియు ప్రధాన అర్చకుల సహకారంతో ఆలయ ప్రాంగణంలో నిర్మించిన కొత్త షెడ్డులో మొదటి భారీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో దేవాలయ ఈ.ఓ కృష్ణమాచారి,మేడ్చల్–మల్కాజిగిరి వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ విటల్ నాయక్, ట్రస్ట్ బోర్డు చైర్మన్ పొట్టు బాబూరావు, పడమటి మల్లారెడ్డి, నరేందర్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, వినోద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వల్భాపూర్‌లో ఘనంగా శ్రీ పశుపతినాథ్ దేవస్థానం లో కార్తీక పౌర్ణమి వేడుకలు వల్భాపూర్‌లో ఘనంగా శ్రీ పశుపతినాథ్ దేవస్థానం లో కార్తీక పౌర్ణమి వేడుకలు
-ఆలయ అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి ఆధ్వర్యంలో సహస్ర బిల్వార్చన, మహా రుద్రాభిషేకం ఎల్కతుర్తి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు): ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ దేవాలయంలో కార్తీక పౌర్ణమి...
సత్యనారాయణ కాలనీలో కార్తీక పౌర్ణమి పూజలు 
దాశరధి కృష్ణమాచార్యుల 38వ వర్ధంతి 
కార్తీక పౌర్ణమి కీసరగుట్ట ఆలయాన్ని సందర్శించిన రాచకొండ సీపీ 
మధు కుమార్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు
ప్రమాదం అంచులో ఆగారం-ఘనపూర్ ప్రధాన రహదారి
జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ గెలుపు ఖాయం