సంస్థ అభివృద్ధికి ప్రతి ఉద్యోగి కృషి చేయాలి.!
సత్తుపల్లి డిపోను పరిశీలించిన ఖమ్మం డిప్యూటీ రీజినల్ మేనేజర్ మల్లయ్య .
సత్తుపల్లి, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
సంస్థ అభివృద్ధిలో ప్రతి ఉద్యోగి నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఖమ్మం డిప్యూటీ రీజినల్ మేనేజర్ మల్లయ్య శుక్రవారం సత్తుపల్లి డిపోను సందర్శించి తెలిపారు.
డిపో మేనేజర్ కార్యాలయంలో డిపో ఏడీసీలు, కంట్రోలర్స్ తో నిర్వహించిన సమావేశంలో రికార్డులను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి ఉండటంతో వాటి నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలని మల్లయ్య గారు సూచించారు. ముందుగా డిపో గ్యారేజ్‌ను పరిశీలించి, నిర్వహణపై తగిన సూచనలు చేశారు.
డిపో అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొని, వారితో తరచుగా సమావేశాలు నిర్వహించి ఇపికే, ఓఆర్ పెరుగుతుండే విధంగా చూడాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కల్లూరు బస్టాండు, బంజార బస్టాండులను కూడా పరిశీలించారు. గతంలో అందించిన విధమైన కృషిని కొనసాగిస్తూ డిపో అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని మల్లయ్య గారు ఆకాంక్షించారు.
డిపో అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై అధికారులు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ఊటుకూరి సునీత, అసిస్టెంట్ మేనేజర్ పి. విజయశ్రీ, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఎస్. సాహితి, ఏబీసీలు తదితరులు పాల్గొన్నారు.


Comments