పేద విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలి.

పేద విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు.

* బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు 

ఖమ్మం బ్యూరో, నవంబర్ 03, తెలంగాణ ముచ్చట్లు;

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఖమ్మం  జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. సోమవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.  రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. పేద విద్యార్థుల భవిష్యత్తు నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. అయినా ప్రభుత్వం మాత్రం నిశ్చలంగా ఉంది,” అని మండిపడ్డారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకు పూర్తి పారదర్శకంగా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ హామీని విస్మరించిందని ఆయన విమర్శించారు. “వారు ఇచ్చిన టోకెన్ల ఆధారంగా చెల్లింపులు జరగాల్సింది పోయి, నిధుల లేమి పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇది విద్యా రంగానికి తీవ్రమైన నష్టం,” అని పేర్కొన్నారు.

గతంలో విద్యాసంస్థల యాజమాన్యాలు బంద్‌ చేపట్టి, సంవత్సరం రోజులపాటు పోరాడి ప్రభుత్వాన్ని కదిలించగా, ప్రభుత్వం రూ.1,200 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించి మాట తప్పిందని ఆయన గుర్తుచేశారు. “మళ్లీ అదే పరిస్థితి పునరావృతమవుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల విద్యాసంస్థలు మళ్లీ బంద్‌ దిశగా వెళ్తున్నాయి. దీని ఫలితంగా పేద విద్యార్థులు తమ చదువులపై దెబ్బతింటారు,” అని కోటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు.  భవిష్యత్తు కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన హితవు పలికారు. “ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖను తన ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ పేద విద్యార్థులకు ఏ మాత్రం భరోసా కల్పించలేకపోతున్నారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం ఫీజు చెల్లింపులపై గ్యారంటీ ఇవ్వాలి. విద్యార్థులు విద్యను వదిలేయకుండా చర్యలు తీసుకోవాలి,” అని డిమాండ్‌ చేశారు.

ప్రస్తుతం ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ల విడుదల కోసం విజ్ఞప్తి చేస్తే, ప్రభుత్వం విజిలెన్స్‌ దాడుల పేరుతో బెదిరించడం అత్యంత దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇది ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధం. పేదల విద్యను బంధీ చేయడం అన్యాయం. ఈ విధానాలు కొనసాగితే గత ప్రభుత్వానికి పట్టిన గతి, ఈ ప్రభుత్వానికీ తప్పదని ప్రజలు చాటుతారు,” అని హెచ్చరించారు.

తక్షణమే ప్రభుత్వం విద్యాసంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపి, బకాయిలు విడుదల చేసి సమస్యను పరిష్కరించాలని  నెల్లూరి కోటేశ్వరరావు స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు  ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు 
-హైకోర్టు తీర్పును గుర్తుచేసిన ప్రైవేట్ పాఠశాలల సంఘం ఎల్కతుర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు మండల...
ఐకేపీ కేంద్రాల్లో రైతుల కష్టాలు 
సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు 
భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన  
సత్యనారాయణ కాలనీలో కొత్త వైన్‌షాప్‌కి ప్రజల తీవ్ర వ్యతిరేకం
పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభల లోగో ఆవిష్కరణ
రామారావు హత్యను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం