కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి 

 కార్పొరేటర్ ప్రభుదాస్ పర్యటన

కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి 

కాప్రా, నవంబర్ 03 (తెలంగాణ ముచ్చట్లు):

మీర్పేట్ హెచ్‌బి కాలనీ డివిజన్‌లోని అన్నపూర్ణ కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధి పనులను పరిశీలిస్తూ స్థానిక నాయకులతో కలిసి పర్యటించిన స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా, సీసీ రోడ్డు నిర్మాణాలకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ మాట్లాడుతూ, కాలనీలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, పెండింగ్‌లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సీసీ రోడ్డు పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయించేలా కృషి చేస్తామన్నారు. మంచినీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.పర్యటనలో నరసింహ గౌడ్, సంజయ్ నాయక్, ప్రేమ్ సాగర్, చంద్రశేఖర్, ప్రసాద్, రాజమల్లు, రాజలింగం తదితర స్థానిక నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .