నూతన ఎంపీడీవోను సన్మానించిన బంజారా సేవా సంఘం నాయకులు
పెద్దమందడి,నవంబర్04( తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలానికి నూతనంగా నియమితులై బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవో పరిణత ను మంగళవారం బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిషన్ నాయక్, ఉపాధ్యక్షులు గోపాల్ నాయక్, జంపా నాయక్ ,శంకర్ నాయక్, రాజు నాయక్, రమేష్ నాయక్ శంకర్ నాయక్, కిషన్ నాయక్ లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మండల ప్రజా పరిషత్ కు ప్రజలు వారి సొంత పనుల నిమిత్తం, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, నూతన పింఛన్ల కొరకై దరఖాస్తు చేసుకోవడానికి వస్తూ ఉండే వారిని గుర్తించి వారికి త్వరితగతిన నూతన పింఛన్లు అమలు ఆయె విధంగా కృషి చేయాలని, ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన వారిని గుర్తించి వారికి ఇందిరమ్మ గృహాల రూపకల్పనలో పరిశీలించి ఇందిరమ్మ పథకం ద్వారా వచ్చే నిధులను వెంటనే అర్హులైన ఇందిరమ్మ గృహాల లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసే విధంగా మీ వంతు కృషి చేయాలని వారు కోరారు.


Comments