విద్యార్థుల కోసం డ్రోన్ సాంకేతిక వర్క్‌షాప్ విజయవంతం.

విద్యార్థుల కోసం డ్రోన్ సాంకేతిక వర్క్‌షాప్ విజయవంతం.

సత్తుపల్లి, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):

మండల పరిధిలోని బి.గంగారం గ్రామంలో స్వయంప్రతిపత్తి కలిగిన సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసిఈ, ట్రిపుల్ ఈ మూడవ, నాలుగవ సంవత్సరం విద్యార్థులకు డ్రోన్ సాంకేతికంపై మూడు రోజుల వర్క్‌షాప్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (హైదరాబాద్) సౌజన్యంతో నిర్వహించబడింది. దీనికి ఐఈటిఈ సహకారం అందింది.

వర్క్‌షాప్‌లో విద్యార్థులకు డ్రోన్ సాంకేతిక విజ్ఞానం, ప్రాజెక్టుల ద్వారా అన్వయించే విధానాలు, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు తెలియజేయబడ్డాయి. డ్రోన్ సాంకేతికత వ్యవసాయం, పరిశీలన, సరుకుల పంపిణీ వంటి రంగాల్లో కొత్త అవకాశాలను తెరుస్తుందని వివరించారు.

కళాశాల ఈసిఈ విభాగాధిపతి డాక్టర్ పాముల శేఖర్ బాబు మరియు ట్రిపుల్ ఈ విభాగాధిపతి కోట రామకృష్ణప్రసాద్ సమన్వయం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి మాట్లాడుతూ, ఈ వర్క్‌షాప్ ద్వారా విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంలో నూతన అవగాహన, పరిశ్రమలో ప్రాక్టికల్ అనుభవం పొందడమే కాకుండా భవిష్యత్ వృత్తిపరమైన మార్గంలో ముందుకు సాగడానికి ఇది కీలకంగా ఉంటుందని తెలిపారు.

వర్క్‌షాప్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పతకాలు మరియు సర్టిఫికెట్లు అందజేయబడ్డాయి.

కళాశాల కార్యదర్శి & పరిపాలక దాసరి ప్రభాకర్ రెడ్డి ఈ వర్క్‌షాప్ విద్యార్థుల సాంకేతిక అవగాహన పెంపొందించడంలో మరియు డ్రోన్ సాంకేతిక అవసరాలకు తగిన నైపుణ్యాలను అందించడంలో కీలకంగా ఉందని, ఇది విద్యార్థుల భవిష్యత్ ఉపాధి అవకాశాలను విస్తరించే అవకాశం అని పేర్కొన్నారు.WhatsApp Image 2025-10-24 at 4.07.23 PM

కార్యక్రమ సమన్వయకర్తలు పి.నాగశేఖర్, వి.బి.గోపాలకృష్ణ, ఎన్.జి.కృష్ణ, జె.కాంతయ్య పాల్గొన్నారు. అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వర్క్‌షాప్ విజయవంతం చేశారు. చివరగా నిర్వాహకులు అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .