భగీరథుడి పట్టుదల అందరికీ ఆదర్శం
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
పెద్దమందడి,అక్టోబర్24(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండల కేంద్రంలో భగీరథ మహర్షి విగ్రహాన్ని శుక్రవారం వనపర్తి శాసనసభ్యుడు తూడి మేఘారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భగీరథుడి పట్టుదల ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉండాలని అన్నారు. నేను ఎల్లవేళలా భగీరథ మహర్షిని నా వ్యక్తిగత ఆదర్శంగా తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు.
సగరుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలు చేయడం ద్వారా సగరులకు నిజమైన గుర్తింపు లభిస్తోందని ఎమ్మెల్యే వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశానికి రోల్ మోడల్‌గా నిలిచారని అన్నారు.
పెద్దమందడి మండల కేంద్రంలో 20 లక్షల రూపాయలతో సగరుల సామూహిక భవనం అభివృద్ధి చేయబడనున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో సగర సంగం రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు..jpeg)


Comments