పార్కుల అభివృద్ధి పనులపై పర్యటించిన కార్పొరేటర్ ప్రభుదాస్
కాప్రా, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్.బీ. కాలనీ డివిజన్ పరిధిలోని రాజీవ్ పార్కు మరియు కృష్ణానగర్ పార్కులను అభివృద్ధి చేయడానికి చేపట్టిన మరమ్మత్తు పనుల పురోగతిని పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ అధికారులతో కలిసి పర్యటించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, రాజీవ్ పార్కులో పాడైన జిమ్ పరికరాల స్థానంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చెట్ల చుట్టూ ఉన్న కొమ్మలను తొలగించి, పార్కు పరిసరాలను శుభ్రం చేసి పచ్చదనం మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
పార్కును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, స్థానిక ప్రజలకు అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యమని ఆయన అన్నారు.తరువాత ప్రభుదాస్ కృష్ణానగర్ పార్కును సందర్శించి, దాన్ని బయోవర్సిటీ పార్కు నమూనాలో అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ అన్నపూర్ణ, హార్టికల్చర్ ఆఫీసర్ లోకేష్, అధికారులు అశోక్, దేవీరాజ్, దండెం నరేందర్ తదితరులు పాల్గొన్నారు.


Comments