కార్తీక మాసం శుభాకాంక్షలు 

అయ్యప్ప భక్తులకు శుభవార్త..

కార్తీక మాసం శుభాకాంక్షలు 

.ఖమ్మం బ్యూరో , అక్టోబర్ 23, తెలంగాణ ముచ్చట్లు;

ఖమ్మం జిల్లాలోని అయ్యప్ప భక్తులకు టీజేఎస్ఆర్టిసి ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్  శబరిమల అయ్యప్ప దర్శనం వెళ్ళుట కొరకు ఖమ్మం రీజియన్ పరిధిలోని ఏటు డిపో మేనేజర్లకు అధునాతనమైన 36 పుష్ బ్యాక్ సీట్లు గల సూపర్ లగ్జరీ బస్సులను తక్కువ ధరలకు అయ్యప్ప భక్తులు అడిగిన వెంటనే ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది .అలానే అయ్యప్ప భక్తులకు ఐదు రోజుల ప్రయాణం గాని లేదా ఏడు రోజుల ప్రయాణానికి గాని అనువైన బస్సులు సిద్ధంగా ఉంచాలని చెప్పడం జరిగింది
మరియు ఇట్టి ప్రయాణంలో ఒక గురుస్వామి, ఇద్దరు మణికంఠ స్వాములకు, ఇద్దరు వంట స్వాములకు కూడా ఉచిత ప్రయాణం ఇవ్వాలని అధికారులకు సూచించారు. కావున అయ్యప్ప గురు స్వాములైన, అయ్యప్ప భక్తులైన ఇలాంటి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఓ ప్రకటనలో విడుదల చేశారు . మరిన్ని వివరాలకు అన్ని డిపో మేనేజర్లను  డిపో మేనేజర్ల ఫోన్ నెంబర్లు  ఖమ్మం డిపో మేనేజర్ 9959225958 
సత్తుపల్లి డిపో 9959225962
 కొత్తగూడెం డిపో మేనేజర్
 9959225959 భద్రాచలం డిపో మేనేజర్ 9959225960
మధిర డిపో మేనేజర్ 9959225961  మణుగూరు డిపో మేనేజర్ 9959225963 సంప్రదించాలని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .