పోలీసు అమరవీరులకు నివాళిగా బైక్ ర్యాలీ.
సత్తుపల్లి, అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
పోలీసు జెండా దినోత్సవాల లో భాగంగా బి గంగారం 15వ ప్రత్యేక పోలీసు బెటాలియన్ ఆధ్వర్యంలో శనివారం గంగారం గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బెటాలియన్ నుండి బయలుదేరిన ర్యాలీ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగి ప్రజల్లో పోలీసు అమరవీరుల త్యాగాలపై అవగాహన కల్పించారు. బెటాలియన్ సిబ్బంది, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బెటాలియన్ అదనపు కమాండెంట్ ఏ. అంజయ్య మాట్లాడుతూ, ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి పౌరుడి కర్తవ్యమని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ సామాజిక భద్రత, ప్రజల ప్రశాంత జీవనానికి అండగా నిలుస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో బెటాలియన్ సహాయ కమాండెంట్లు ఎస్.శ్రీధర్ రాజా, యస్.డి. రంగారెడ్డి, ఇతర అధికారులు, కానిస్టేబుల్ సిబ్బంది పాల్గొన్నారు.



Comments