సీపీఐలో చేరిన  చింతల రమేష్.

పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, యం.ఎల్.ఏ కూనoనేని.సాంబశివరావు.

సీపీఐలో చేరిన  చింతల రమేష్.

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 24, తెలంగాణ ముచ్చట్లు:

యువ కమ్యూనిస్టులతోనే కమ్యూనిస్టు పార్టీ సీపీఐకి పూర్వ వైభవం వస్తుందని,కామ్రేడ్ చింతల. రమేష్ పార్టీలో చేరడంతో చాలా సంతోషంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, యం.ఎల్.ఏ కూనoనేని.సాంబశివరావు వెల్లడించారు. స్థానిక గిరి ప్రసాద్ భవన్ లో సీపీఐ జిల్లా కార్యాలయంలో సిపిఎం యువజన విభాగం డి.వై.ఎఫ్.ఐ జిల్లా అద్యక్షుడు చింతల.రమేష్,చిమ్మపూడి గ్రామ సిపిఎం శాఖ కార్యదర్శి రెమల్లె.జైపాల్, శాఖ సభ్యులు జ్యోతిబస్,చంద్రమ్మ,మల్లెంపాటి. రమేష్ లతో పాటు మరికొంతమంది కార్యకర్తలు సిపిఎం పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేసి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనoనేని.సాంబశివరావు, జాతీయ సమితి సభ్యులు భాగం.హేమంత్ రావు,జిల్లా కార్యదర్శి దండి.సురేష్ ఇతర జిల్లా నాయకత్వం సమక్షంలో సీపీఐ పార్టీలో చేరడం జరిగింది.చింతల.రమేష్ కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, యం.ఎల్.ఏ కూనoనేని.సాంబశివరావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగ ఆహ్వానించడం జరిగింది.ఈ సందర్బంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ యువ కమ్యూనిస్టులతోనే కమ్యూనిస్ట్ పార్టీలు బలోపేతం అవుతాయని,చిమ్మపూడి గ్రామం నుండి గత 15 సంవత్సరాలుగా వామపక్ష ఉద్యమాలలో పనిచేసిన చింతల.రమేష్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.డిసెంబర్ 26న కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల వేడుక ఉద్యమాల గుమ్మం ఖమ్మం అయిందని అయిదు లక్షల మందితో భారీ బహిరంగ సభ ఉంటుందని ఖమ్మం జిల్లాలో ఉన్న పార్టీ శ్రేణులు అహర్నిశల కృషి చేసి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సభలో సీపీఐ జాతీయ కమిటీ  సభ్యులు భాగం.హేమంత్ రావు,రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మెన్ మౌలానా,జిల్లా కార్యదర్శి దండి.సురేష్  మాట్లాడుతూ జిల్లాలో డిసెంబర్ 26న జరిగే భారీ బహిరంగ సభ ద్వారా సీపీఐ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని,పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలనిపార్టీని బలోపేతం చేయాలని వారు పిలుపునిచ్చారు. WhatsApp Image 2025-10-24 at 9.19.23 PMఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు జానీమియా,గోవిందరావు,సలాం,సింగు నరసింహరావు, మేకల శ్రీనివాసరావు,పోటు కళావతి,సీతామహాలక్ష్మి,తాటి వెనకటేశ్వరావు పగడాల మల్లేష్,యానాల సాంబశివారెడ్డి,రఘునాథపాలెం మండల కార్యదర్శి శాకమూరి శ్రీనివాస్ విద్యార్థి, యువజన నాయకులు నానాబాల రామకృష్ణ ,ఇటికల రామకృష్ణ,మడిపల్లి లక్ష్మణ్ సమితి సభ్యులు తాటి నిర్మల,శ్రావన్,సైదా,నాగుల్ మీరా,జూల.వెంకటేశ్వర్లు,ప్రొద్దుటూరు.వెంకటరెడ్డి,గాడిచర్ల.సత్యనారాయణ రఘుంధపాలెం మండల,చిమ్మపూడి గ్రామ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

వల్భాపూర్‌లో ఘనంగా శ్రీ పశుపతినాథ్ దేవస్థానం లో కార్తీక పౌర్ణమి వేడుకలు వల్భాపూర్‌లో ఘనంగా శ్రీ పశుపతినాథ్ దేవస్థానం లో కార్తీక పౌర్ణమి వేడుకలు
-ఆలయ అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి ఆధ్వర్యంలో సహస్ర బిల్వార్చన, మహా రుద్రాభిషేకం ఎల్కతుర్తి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు): ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ దేవాలయంలో కార్తీక పౌర్ణమి...
సత్యనారాయణ కాలనీలో కార్తీక పౌర్ణమి పూజలు 
దాశరధి కృష్ణమాచార్యుల 38వ వర్ధంతి 
కార్తీక పౌర్ణమి కీసరగుట్ట ఆలయాన్ని సందర్శించిన రాచకొండ సీపీ 
మధు కుమార్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు
ప్రమాదం అంచులో ఆగారం-ఘనపూర్ ప్రధాన రహదారి
జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ గెలుపు ఖాయం