దొంగతనం కేసులో నలుగురు అరెస్ట్

దొంగతనం కేసులో నలుగురు అరెస్ట్

హసన్ పర్తి, అక్టోబర్ 27,(తెలంగాణ ముచ్చట్లు):

అనేక సంవత్సరాలుగా దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను హసన్ పర్తి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హనుమకొండ ఏసిపి ప్రశాంత్ రెడ్డి నిందితుల వివరాలను వెల్లడించాడు. హసన్ పర్తి ఎస్సై గోవర్ధన్, దేవేందర్ లు తమ సిబ్బందితో మండలంలోని సీతంపేట క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా పాత రైస్ మిల్ వద్ద ఉన్న ముగ్గురు కలుగుల సాయిచంద్(24), రెడ్లం రాకేష్(28), గంపల సాయి తేజ(21) అనే వ్యక్తులు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో వారిని విచారించగా వివిధ ప్రదేశాల్లో కాజీపేట,మడికొండ,ధర్మసాగర్,తీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలు,గంజాయి అమ్మకాలు చేసే ప్రవృత్తి కలిగిన వ్యక్తులుగా తేలడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.అదేవిధంగా అదే ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్సై దేవేందర్ సిబ్బందికి మరో వ్యక్తి ఆలకుంట ఆలియాస్ ముద్దంగుల అనిల్(23) అనే వ్యక్తి అనుమానస్పదంగా కనబడడంతో అతనిని విచారించగా 2018 సంవత్సరం నుంచి ఇప్పటివరకు కాజీపేట,ఉప్పల్,హయత్ నగర్,మర్రిగూడ, భువనగిరి,సుబేదారి,హనుమకొండ,మడికొండ, ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 మోటార్ సైకిల్ దొంగతనాల కేసులు నమోదయి ఉన్నట్లు ఏసిపి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.ఈ మధ్యకాలంలో అనిల్ హసన్ పర్తి బస్టాండ్ లోని ఓ బేకరీ ముందు ఉంచిన మోటార్ సైకిల్ సైతం దొంగిలించిన కేసులో నిందితుడు.ఈ కేసుల్లో అనేకమార్లు జైలుకు వెళ్లి వచ్చినట్లు ఎసిపి తెలిపారు.నిందితుల నుంచి స్వాధీన పరచుకున్న మోటార్ సైకిల్,మూడు  గ్రాములు గంజాయి,హసన్ పర్తి,హనుమకొండ , జనగామ పరిధిలో దొంగతనం చేసిన మోటర్ సైకిల్ లను స్వాధీనపరచుకున్నట్లు ఏసిపి తెలిపారు.ఈ సందర్భంగా హసన్ పర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ చేరాలు, ఎస్సై దేవేందర్,గోవర్ధన్ లతోపాటు క్రైమ్ సిబ్బంది క్రాంతి తదితరులను అభినందించి క్రైమ్ సిబ్బందికి పారితోషకాన్ని అందించాడు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక
-మన స్వాతంత్ర్య సమరయోధులలో  ఆత్మవిశ్వాసాన్ని రగిలించిన గీతం  -ఎస్సై ఏ. ప్రవీణ్ కుమార్  ఎల్కతుర్తి. నవంబర్ 07(తెలంగాణ ముచ్చట్లు): స్వాతంత్ర్య సమరయోధులలో ఆత్మవిశ్వాసం, త్యాగస్ఫూర్తిని రగిలించిన వందేమాతరం...
సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హైస్కూల్లో ఘనంగా “వందేమాతరం 150 ఏళ్ల” సంబరాలు
నిరూపయోగంగా పబ్లిక్ టాయిలెట్లు 
జూబ్లీహిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే -నగరాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం
ఈసీఐఎల్ మెగా జూనియర్ కాలేజీలో సామూహిక వందేమాతరం గానం
రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు
కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం