పోలీస్ అమరవీరుల స్మారకోత్సవాల సందర్భంగా సైకిల్ ర్యాలీ నిర్వహణ
కాప్రా, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
పోలీస్ అమరవీరుల స్మారక ఉత్సవాల లో భాగంగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సైకిల్ ర్యాలీ విజయవంతంగా నిర్వహించారు. ఈ ర్యాలీ ఉదయం 6:30 గంటలకు ఈసీఐఎల్ ఎక్స్ రోడ్ వద్ద ప్రారంభమై, ఏ ఎస్ రావు నగర్ సిగ్నల్ వరకు వెళ్లి తిరిగి ఈసీఐఎల్ ఎక్స్ రోడ్ వద్ద ముగిసింది.కుషాయిగూడ ఏసిపి వై. వెంకటే రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ ఎల్. భాస్కర్ రెడ్డి, ఎస్‌ఐలు ఎన్. సుధాకర్ రెడ్డి, ఎన్. వెంకన్న, సతీష్, విజయ్ తదితరుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం సాఫల్యంగా జరిగింది. విద్యార్థులు, యువత, పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా ర్యాలీకి విశేష స్పందన లభించింది.ఈ సందర్భంగా ఏసిపి వెంకటే రెడ్డి మాట్లాడుతూ — “దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకోవడం మన అందరి బాధ్యత. వారి సేవా త్యాగాలను గుర్తు చేస్తూ, సమాజంలో పోలీసుల పట్ల గౌరవ భావం పెంచడమే ఈ ర్యాలీ ఉద్దేశ్యం” అని తెలిపారు.కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, స్థానిక ప్రజలకు అధికారులు ధన్యవాదాలు తెలిపారు.


Comments