పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

కబ్జా ప్రయత్నాలకు చెక్ 

– రెండు వేల గజాల పార్కు రక్షణ

శేరిలింగంపల్లి,అక్టోబర్24(తెలంగాణ ముచ్చట్లు):

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని రాఘవేంద్ర కాలనీలో పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు శుక్రవారం రక్షించారు. పార్కుతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కేటాయించిన రెండు వేల గజాల స్థలాన్ని కొందరు ఆక్రమించి బై నంబర్లు సృష్టించి ప్లాట్లుగా మార్చారు. ప్రతి ప్లాట్‌లో షెడ్లు నిర్మించి కబ్జాకు ప్రయత్నించారు.

రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధుల ఫిర్యాదుతో హైడ్రా ప్రజావాణి ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు సంబంధిత శాఖలతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ఆ స్థలం లేఅవుట్‌లో పార్కు, కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించబడినదని నిర్ధారించారు.తదుపరి హైడ్రా అధికారులు ఆక్రమణలను తొలగించి, వెంటనే ఫెన్సింగ్ వేసి ‘పార్కు స్థలం – హైడ్రా రక్షణలో ఉంది’ అనే బోర్డులను ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ స్థలం మార్కెట్ విలువ దాదాపు రూ.30 కోట్లుగా అంచనా.


WhatsApp Image 2025-10-24 at 8.16.39 PMహైకోర్టు ఆదేశాలతో నిలిచిన అనుమతులు

200 గజాల చొప్పున 10 ప్లాట్లుగా బై నంబర్లు సృష్టించి, వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడమే కాకుండా భవన నిర్మాణానికి అనుమతులు కూడా పొందినట్లు తేలింది. అయితే హైకోర్టు ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ ఆ అనుమతులను వెనక్కి తీసుకోవడంతో పాటు రెగ్యులరైజేషన్‌ను కూడా రద్దు చేసింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .