తెలుగు మాతృశ్రీ సేవా అవార్డుకు జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ ఎంపిక

తెలుగు మాతృశ్రీ సేవా అవార్డుకు జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ ఎంపిక

సంచలనాత్మక కథనాలకు కేరాఫ్...

వెల్లువెత్తుతున్న అభినందనలు...

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 25, తెలంగాణ ముచ్చట్లు:
 
ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బండి కుమార్ జాతీయ కవి సమ్మేళనం తెలుగు మాతృశ్రీ సేవా అవార్డుకి ఎంపికయ్యారు. సీనియర్ జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ గత 12 సంవత్సరాలుగా వివిధ ఛానెల్స్, పత్రికల్లో, వివిధ హెదాల్లో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు. అనేక అంశాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా ప్రజా సమస్యలను వెలికి తీస్తూ ప్రభుత్వాల ద్వారా వాటిని పరిష్కరించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. ఈవిధంగా సమాజానికి సేవచేస్తూ, సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నందుకు అతని సేవలను గుర్తించి ఈ నెల అక్టోబర్ 26 ఆదివారం రోజున ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయం బస్ డిపో రోడ్డులో జరిగే జాతీయ కవి సమ్మేళనం కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ పార్లమెంటు సభ్యులు రామసహయం రఘురాం రెడ్డి, అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ యు.వి.రత్నం, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్  రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు చేతుల మీదుగా ఆయనకు ప్రధానం చేస్తున్నారు, ఈ కార్యక్రమంలో జాతీయ కవి సమ్మేళనం నిర్వహించబడును. సీనియర్ జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ "పీపుల్స్ డైరీ" దినపత్రిక ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక సంచలనాత్మక కథనాలను ఆయన అందించారు. ఎక్కడ అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నా ఎలాంటి శక్తుల ఒత్తిళ్లకు లొంగకుండా నిర్భయంగా వార్తలు అందించడంలో దిట్ట... జర్నలిజం వృత్తినే శ్వాసగా... నైతిక విలువలను పాటిస్తూ పేదల పక్షాన నిలువడం, అన్యాయాన్ని ఎదురించడం ఆయన లక్షణం.. అక్రమార్కుల
బెదిరింపులకు వెరువకుండా, అక్రమ కేసులకు సైతం భయపడకుండా ఆయన ఎంచుకున్న దారిలో దూసుకెళ్తూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎందరో జర్నలిస్టులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఆయనకు అవార్డు రావడం పట్ల స్థానిక సీనియర్ జర్నలిస్టులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అభినందనలు తెలుపుతూ డాక్టర్ బండి కుమార్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు
మల్కాజ్గిరి, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు) వందేమాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాచకొండ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాచకొండ పోలీస్...
కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం
అమ్మపల్లి ప్రభుత్వ పాఠశాలకు బెంచీలు, గ్రీన్ బోర్డులు పంపిణీ
నాగారం మున్సిపాలిటీలో  వందే మాతరం 150 ఏళ్ల వేడుకలు 
కాజీపేట్ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఘనంగా వందేమాతరo గీతా లాపన
నాగారం మద్యం దుకాణం పై రగడ
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం