నేడు డయల్ యువర్ డిపో మేనేజర్.
సత్తుపల్లి, అక్టోబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రయాణికుల సమస్యలను ప్రత్యక్షంగా విని పరిష్కారం చూపే దిశగా ఆర్టీసీ తీసుకుంటున్న ప్రజాహిత చర్యల్లో భాగంగా సత్తుపల్లి డిపోలో ‘డయల్ యువర్ డిపో మేనేజర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ ఊటుకూరి సునీత తెలిపారు. ఈ కార్యక్రమం నేడు (సోమవారం) సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు జరగనుందని చెప్పారు.
సత్తుపల్లి ఆర్టీసీ బస్సుల రాకపోకలు, టైమింగులు, సీటింగ్, బస్సుల శుభ్రత, సిబ్బంది ప్రవర్తన, రద్దీ, పర్సులు/లగేజీ సమస్యలు వంటి ఏదైనా అంశం పై ప్రయాణికులు తమ ఫిర్యాదులు, సూచనలు, సమస్యలు, అభిప్రాయాలు నేరుగా చెప్పవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చే సూచనలు సేవల మెరుగుదలకు ఎంతో తోడ్పడతాయని చెప్పారు. ప్రయాణికులు 9959225962 నంబర్‌కు ఫోన్ చేసి నేరుగా మాట్లాడవచ్చని తెలిపారు.
ప్రజా సేవలను మరింత బలోపేతం చేయడానికి ప్రజల భాగస్వామ్యం అవసరం కాబట్టి సత్తుపల్లి డిపో పరిధిలోని ప్రతి ప్రయాణికుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.


Comments