కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం
కుషాయిగూడ, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు)
కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఉదయం 10 గంటలకు సామూహికంగా “వందే మాతరం” గానం నిర్వహించారు. వందే మాతరం గేయం రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న వేడుకలలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో 200 మంది నారాయణా స్కూల్ విద్యార్థులు, స్థానిక పౌరులు, కుషాయిగూడ ఏసీపీ వై. వెంకట్ రెడ్డి, సిఐ ఎల్. భాస్కర్ రెడ్డి, ఎస్సై సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్, విజయ్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏసీపీ వై. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, వందే మాతరం గేయం భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అందించిన ప్రేరణ గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చిన్న వయసులోనే చట్టాలను గౌరవిస్తూ, దేశం పట్ల భక్తి మరియు గౌరవభావం కలిగి ఉండాలని సూచించారు.
కార్యక్రమం దేశభక్తి వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.


Comments