చట్ పూజ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్

పన్నాల దేవేందర్ రెడ్డి

చట్ పూజ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్

మల్లాపూర్, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):

మల్లాపూర్ డివిజన్ పరిధిలోని దత్తాత్రేయ నగర్‌లో సోమవారం రోజు చట్ పూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వందలాది మంది భక్తులు సూర్యదేవునికి అర్పణలు సమర్పించి ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం ప్రార్థనలు చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ — “చట్ పూజ వంటి సాంప్రదాయ వేడుకలు భారతీయ సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకలు. భక్తి, సమైక్యతతో ఇలాంటి పూజలు జరపడం ఆనందదాయకం” అన్నారు.దేవేందర్ రెడ్డి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించి, భక్తులందరికీ చట్ పూజ శుభాకాంక్షలు తెలిపారు.ఈకార్యక్రమంలో నిర్వాహకులు రాజు రాయి, కాశప్, చత్రుధన్, సందీప్, వివేక్తో పాటు స్థానిక నాయకులు వాసుదేవ్ గౌడ్, తీగుళ్ల శ్రీనివాస్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .