మల్లాపూర్ సదర్ సమ్మేళనంలో నెమలి అనిల్ కుమార్ పాల్గొన్నారు.
మల్లాపూర్, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మల్లాపూర్ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సదర్ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని యాదవ సోదర సోదరీమణులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ –“యాదవ సమాజం మన రాష్ట్ర సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇటువంటి సాంప్రదాయ కార్యక్రమాలు మన సంస్కృతిని సజీవంగా నిలుపుతున్నాయి. యువత ఇలాంటి ఉత్సవాల్లో పాల్గొని సమాజ ఐక్యతకు తోడ్పడాలి” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మల్లాపూర్ గ్రామ పెద్దలు, యాదవ సంఘ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా సదర్ ఉత్సవాలను నిర్వహించారు.
సాంప్రదాయ డప్పు వాయిద్యాలు, పశువుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.యాదవ సంఘ అధ్యక్షులు ఈ సందర్భంగా మాట్లాడుతూ –“ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే సదర్ సమ్మేళనం మన సమాజానికి ఐక్యతకు ప్రతీక. ఈ ఉత్సవం మన పశువుల పట్ల గౌరవం, ఆచార సంప్రదాయాల పట్ల భక్తిని చాటుతుంది”అన్నారు.కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,యువనేత లు, సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Comments