వరంగల్‌లో టిబెటియన్ ఉలెన్ స్వెటర్ మార్కెట్ ప్రారంభం.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ,అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ అశోక హోటల్ ఎదురుగా పాత మున్సిపాలిటీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన టిబెటియన్ ఉలెన్ స్వెటర్ మార్కెట్‌ను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యుడు నాయినిరాజేందర్ రెడ్డి ప్రారంభించారు
.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి శీతాకాలంలో టిబెటియన్ ఉలెన్ మార్కెట్ వరంగల్ నగర ప్రజలకు ఆకర్షణగా మారిందని, మంచి నాణ్యత గల ఉలెన్ దుస్తులను సరసమైన ధరల్లో అందిస్తుందని తెలిపారు. దశాబ్దాలుగా టిబెటియన్ వ్యాపారులు వరంగల్ ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ విశ్వాసాన్ని సంపాదించారని పేర్కొన్నారు.
అలాగే స్థానిక ప్రజలు చిన్న వ్యాపారులు, హస్తకళాకారులను ప్రోత్సహించాలన్నారు. స్థానికంగా ఉత్పత్తి అయ్యే వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈ.వి. శ్రీనివాస్ రావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్, నాయకులు బిల్ల రమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments