క్రీడా క్రమశిక్షణతోనే విజయం సాధ్యం

జిల్లెల్ల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

క్రీడా క్రమశిక్షణతోనే విజయం సాధ్యం

వనపర్తి,నవంబర్06(తెలంగాణ ముచ్చట్లు):

గోపాల్ పేట్ మండలం బుద్ధారం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల 11వ క్రీడా మీట్ ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి  మరియు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి  ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థుల చేత గౌరవ వందనం స్వీకరించారు.

డాక్టర్ చిన్నారెడ్డి మాట్లాడుతూ.. క్రీడలు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు మరియు సమన్వయ సామర్థ్యాలను పెంపొందించడంలో సహాయపడతాయని తెలిపారు. క్రీడాకారులు దృఢంగా, శక్తివంతంగా ఉండటానికి పౌష్టికాహారం ముఖ్యమని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం మెస్ చార్జీలను పెంచి క్రీడాకారుల శారీరక ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నదని వివరించారు.

డాక్టర్ చిన్నారెడ్డి  ముఖ్యంగా మహిళా క్రీడాకారుల విజయాలను ప్రశంసిస్తూ, ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో సాధించిన విజయం దేశ ప్రతిష్టను పెంచిందని, యువ క్రీడాకారులు కూడా ఇష్టమైన క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్న సూచన చేశారుWhatsApp Image 2025-11-06 at 8.02.34 PM. క్రీడల్లో గెలుపు-ఓటములు సహజమని, ఈ ప్రక్రియలో కష్టపడి మరింత శ్రమించడం ద్వారా విజయం సాధించవచ్చని విద్యార్థులను ప్రేరేపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభవంతులైన క్రీడాకారులకు అవసరమైన వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉందని, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో రాణించి పాఠశాలకు, తల్లిదండ్రులకు గౌరవం తీసుకురావాలని సూచించారు. అలాగే, గ్రూప్ 1, గ్రూప్ 2 నియామక పత్రాలు ఇచ్చే సమయంలో తల్లిదండ్రుల ఖాతాలో నేరుగా 20 శాతం జమ చేస్తారని వివరించారు.

క్రీడాకారులు జాతీయ స్థాయిలో విజయవంతమైనవారిని డాక్టర్ చిన్నారెడ్డి  మరియు ఆదర్శ్ సురభి  సన్మానించారు.

ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి జిల్లా జెడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు మరియు స్థానిక క్రీడాకారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం
కుషాయిగూడ, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు)  కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఉదయం 10 గంటలకు సామూహికంగా “వందే మాతరం” గానం నిర్వహించారు. వందే మాతరం గేయం...
అమ్మపల్లి ప్రభుత్వ పాఠశాలకు బెంచీలు, గ్రీన్ బోర్డులు పంపిణీ
నాగారం మున్సిపాలిటీలో  వందే మాతరం 150 ఏళ్ల వేడుకలు 
కాజీపేట్ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఘనంగా వందేమాతరo గీతా లాపన
నాగారం మద్యం దుకాణం పై రగడ
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం
గండి రామారం పంపు హౌస్ ఎత్తిపోతల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి