నాగారం మున్సిపాలిటీలో వందే మాతరం 150 ఏళ్ల వేడుకలు
కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం
నాగారం, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
మాతృభూమి గీతం “వందే మాతరం” రచయిత బంకింఛంద్ర చటర్జీ రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాగారం మున్సిపాలిటీలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.కార్యాలయ ప్రాంగణంలో అందరూ కలిసి దేశభక్తి ఉత్సాహంతో “వందే మాతరం” గీతాన్ని సామూహికంగా ఆలపించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, “ప్రభుత్వ ఆదేశాల మేరకు నవంబర్ 7న రాష్ట్రవ్యాప్తంగా వందే మాతరం గీతాన్ని సామూహికంగా గానం చేయడం దేశప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది.
ప్రతి పౌరుడు భారత మాత పట్ల గౌరవం, గర్వం కలిగి ఉండాలి” అని అన్నారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ బి. నాగిరెడ్డి, రెవెన్యూ అధికారి బి. నాగేశ్వరరావు, కార్యాలయ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


Comments